త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ!

Wedding Bells For SweetyWedding Bells For Sweety

స్వీటీ అనుష్క శెట్టి ఘాటీ తర్వాత సినిమాలకే కాదు సోషల్ మీడియాలో కి కూడా బ్రేక్ ఇచ్చేసింది. ఘాటీ చిత్రం ఎలా ఉన్నా అందులో అనుష్క లుక్స్ పై మాత్రం తీవ్ర విమర్శలొచ్చాయి. అందుకే అనుష్క సోషల్ మీడియా నుంచి తప్పుకుంది. అయితే అనుష్క ప్రేమ, పెళ్లి విషయంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కలిపి మాట్లాడుతుండేవారు.

అనుష్క, ప్రభాస్ ఇద్దరూ.. ఎప్పటికప్పుడు ఆ పుకార్లను ఖండించేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి అనుష్క శెట్టి పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. అనుష్క ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో అనుష్క పెళ్లి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరి నిజంగానే అనుష్క నటనకు బ్రేకిచ్చి పెళ్లి పీటలెక్కబోతుందా, ఈ వార్తలపై స్వీటీ నుంచి ఏదో ఒక రియాక్షన్ వస్తే గాని క్లారిటీ రాదు. 

Reports About Anushka Shetty Possible Wedding

anushka