ఆ హీరోకు బ్యాక్ టు బ్యాక్ షాక్ లు

Back-to-back shocks for that heroBack-to-back shocks for that hero

కామెడీ కి కేరాఫ్ గా నిలిచే హీరో శ్రీ విష్ణు కి ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ రెండు షాక్స్ తగిలాయి. యావరేజ్ అన్న సినిమాలకు ఆడియన్స్ కనిపించడం లేదు. ఫిబ్రవరి 27 న రెండు సినిమాల్తో శ్రీ విష్ణు ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా.. మేకర్స్ విష్ణు విన్యాసాన్ని ఫిబ్రవరి 27 న విడుదల చేసి మృత్యుంజయ్ ని మార్చ్ 7 కి షిఫ్ట్ చేసారు.

ఫిబ్రవరి 27 న విడుదలైన కామెడీ ఫిలిం విష్ణు విన్యాసానికి యావరేజ్ టాక్ స్ప్రెడ్ అయినా.. ఆడియన్స్ ఆ చిత్రాన్ని అంతగా ఇష్టపడలేదు. ఆతర్వాత వారానికే జోనర్ మార్చి మృత్యుంజయ్ తో వచ్చిన శ్రీ విష్ణు కి ఆ చిత్రము హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. జస్ట్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. సుకుమార్ శిష్యుడు దర్శకుడు, అలాగే సెలబ్రిటీస్ మృత్యుంజయ్ సినిమాని ప్రమోట్ చేసినా వర్కౌట్ అవ్వలేదు.

మృత్యుంజయ్ కి రెండు వారాలు దొరికినా క్యాష్ చేసుకోలేకపోయింది. మరి ఒకే ఏడాది.. వారం గ్యాప్ లోనే శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ సినిమాల రిజల్ట్స్ తో డిజప్పాయింట్ అయ్యాడనే చెప్పాలి. ఇకపై శ్రీవిష్ణు రాబోయే చిత్రం ఎక్స్ట్రాడినరీ గా ఉండాలి. ఆ రేంజ్ లోనే సినిమాలు చెయ్యాలి అనేది ఆయన అభిమానుల కోరిక. 

Hero Sree Vishnu

sree vishnu