తమిళ నటుడి బ్రేకప్ స్టోరీ

కోలీవుడ్ లో పవర్ ఫుల్ వాయిస్ తో లోకేష్ కనగరాజ్ సినిమాల్లో బాగా ఫేమస్ అయిన అర్జున్ దాస్ తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా OG లోను నటించాడు. ప్రస్తుతం విలన్ రోల్స్ లో బాగా బిజీ అయిన అర్జున్ దాస్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అనేక అనుమానాలకు తావిచ్చింది.
అర్జున్ దాస్ తన ఇన్స్టా స్టోరీస్ లో లవ్ లో బ్రేకప్ అయినట్లుగా, తనని ఓ అమ్మాయి మోసం చేసినట్లుగా అర్ధాన్నిచ్చేలా ఆ పోస్ట్ ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తే, వారు మీ హృదయాన్ని ముక్కలు చేసినప్పుడు, అసలు మీరు ఎలా ముందుకు సాగగలరు.. అంటూ దానికి హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించాడు అర్జున్ దాస్.
ఆ పోస్ట్ చూసిన వారు అర్జున్ దాస్ కి బ్రేకప్ అయ్యి ఉంటుంది, అర్జున్ దాస్ ని ఎవరో అమ్మాయి ప్రేమించి మోసం చెయ్యడం వలనే ఇలాంటి పోస్ట్ పెట్టాడు, పాపం అర్జున్ దాస్ అంటూ మాట్లాడుకుంటున్నారు.
Arjun Das shares a cryptic heartbreak post on Instagram
Arjun Das cryptic post grabs attentio








































