హోటల్స్ లో కట్టెల పొయ్యి

Hotels - LPG GasHotels - LPG Gas

కమర్షియల్ LPG గ్యాస్ కొరతతో ఇండియా లోని పలు ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతబడుతున్నాయి. బెంగుళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ ఇలా ప్రధాన నగరాలు మాత్రమే కాదు నెల్లూరు, విజయవాడ లాంటి పట్టణాల్లోనూ రెస్టారెంట్స్ గ్యాస్ కొరతతో మూతబడుతుంటే మరికొందరు మెనూ ఐటమ్స్ తగ్గించి నడుపుతున్నారు.

అయితే గ్యాస్ వల్ల వచ్చిన ఈ ఇబ్బందిని అధిగమించేందుకు హైదరాబాద్ లోని కొన్ని హోటల్స్ కట్టెల పొయ్యి పై వంటలు మొదలు పెట్టాయి. రెస్టారెంట్స్ కి కట్టెల పొయ్యి పెట్టె వెసులుబాటు లేదు. కానీ కొన్ని హోటల్స్ తమకున్న స్థలంలో కట్టెల పొయ్యిపై వంట చేసి  పెట్టి కస్టమర్స్ కి ఫుడ్ అందిస్తుంది.

అయితే కట్టెల పొయ్యి పెట్టి సిటీ మధ్యలో హోటల్స్ నడిపించడం ఈజీ అయిన విషయం కాదు, కానీ హైదరాబాద్ లోని కొన్ని హోటల్స్ ఈరకమైన కొత్త ఒరవడికి తెరలేపినా అందుకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. కట్టెల పొయ్యి టేస్ట్ అంటే కాస్ట్లీ అనే ధోరణి లో చాలామంది ఉన్నారు.

మరి కట్టెల పొయ్యిపై వంటలు చేసి సర్వ్ చేసే కష్టమర్స్ నుంచి అదే రకమైన బిల్లులు కూడా హోటల్స్ యాజమాన్యాలు వసూలు చేసే అవకాశం లేకపోలేదు. 

Hotels LPG Gas

lpg