ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anushka estimated net worth is around ₹133 cr

అనుష్క ఆస్తుల విలువ‌

Anushka estimated net worth is around ₹133 crAnushka estimated net worth is around ₹133 cr

పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన‌ `సూప‌ర్` సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది అనుష్క శెట్టి. స్వీటీ శెట్టి .. జేజ‌మ్మగాను పాపుల‌ర్.  ఈ రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న‌ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించింది. అనుష్క కోటి పారితోషికం అందుకున్న సినిమా - అరుంధ‌తి. హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించడ‌మే గాక క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది.

ఆ త‌ర్వాత కూడా అనుష్క టాలీవుడ్ అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ భారీగా పారితోషికాలు అందుకుంది. ప్ర‌స్తుతం 5-6 కోట్ల రేంజులో పారితోషికాలు అందుకుంటున్న అనుష్క‌.. కార్పొరెట్ బ్రాండ్ల‌కు ప్ర‌మోష‌న్ చేయ‌డానికి సుమారు 10 కోట్ల రేంజులో వార్షిక‌ కాంట్రాక్టులు కుదుర్చుకుంటోందనే సమాచారం ఉంది.

తాజా స‌మాచారం మేర‌కు... అనుష్క త‌న సుదీర్ఘ కెరీర్ లో ఆర్జించిన మొత్తం నిక‌ర ఆస్తుల విలువ 133 కోట్లుగా ఉంద‌ని అంచ‌నా. అనుష్కకు బెంగ‌ళూరు, చెన్నై, హైద‌ర‌బాద్ లో సొంత ఇల్లు, అపార్ట్ మెంట్లు ఉన్నాయి..

బెంగ‌ళూరు- హైద‌రాబాద్ లో రియ‌ల్ ఎస్టేట్ లో భారీ పెట్టుబ‌డులు పెట్టార‌ని తెలుస్తోంది. స్టార్ట‌ప్ వ్యాపారాల‌లోను అనుష్క భారీగా పెట్టుబ‌డులు పెట్టారు. అనుష్క ఘాటి త‌ర్వాత ఏ సినిమాలో చేస్తోంది? అంటే... మ‌ల‌యాళంలో 2026లో ఒక సినిమా చేస్తోంది.

Anushka Shetty net worth is estimated between₹134 cr

anushka