Advertisementt

ధురంధర్ 2 - బాబోయ్ ఇదేం క్రేజ్

Mon 09th Mar 2026 08:32 PM
dhurandhar 2  ధురంధర్ 2 - బాబోయ్ ఇదేం క్రేజ్
Dhurandhar 2 ధురంధర్ 2 - బాబోయ్ ఇదేం క్రేజ్
Advertisement
Ads by CJ

ధురంధర్ సీక్వెల్ ధురంధర్ 2 మార్చ్ 19 కి రావడానికి సిద్ధంగా ఉంది. ధురంధర్ కేవలం హిందీలో మాత్రం విడుదలైతే రికార్డ్స్ బ్రేక్ చేస్తే ధురంధర్ 2 మాత్రం పాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలవుతుంది. నార్త్ లోనే కాదు ధురంధర్2 పై పాన్ ఇండియా భాషల్లో ఉన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఓవర్సీస్ ఇలా ఎక్కడ చూడండి పాన్ ఇండియా ఆడియన్స్ ధురంధర్ 2 ఎప్పుడెప్పుడు చూద్దమా అని. స్టూడెంట్స్ అయితే ఉగాది పండగ తర్వాత ముందు ధురంధర్ 2 అంటున్నారు. ఇక ధురంధర్ 2 సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉన్నా మల్టీప్లెక్స్ ఆడియన్స్ మంచి క్రేజ్ మీద ఉన్నారు. అదే అదనుగా చాలా చోట్ల ధురంధర్ 2 ప్రీమియర్స్ కి టికెట్ రేట్లు పెంచేశారు.

ముఖ్యంగా కర్ణాటక బెంగుళూరు మల్టిపెక్స్ ల్లో ధురంధర్ ద రివెంజ్ చూడాలంటే ఒక్కో పర్సన్ కి రూ.2500 కావాల్సిందే. రూ2300, రూ.2400 ల రేట్లు ధురంధర్ 2కి మల్టిప్లెక్స్ ల్లో చూపిస్తున్నాయి. అయినా సోల్డ్ అవుట్. అది చూసే బాబోయ్ ధురంధర్ 2 క్రేజ్ చూస్తే నోట మాటరావట్లేదు అంటున్నారు. 

మరి ధురంధర్ 2 ప్రీమియర్స్ మార్చ్ 18 సాయత్రం నుంచే మొదలు కాబోతున్నాయి. ఆంధ్ర నుంచి నార్త్ వరకు, కర్ణాటక నుంచి ఓవర్సీస్ వరకు మార్చ్ 18 న ఒకే సమయంలో ధురంధర్ 2 ప్రీమియర్స్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Dhurandhar 2:

Dhurandhar The Revenge

Tags:   DHURANDHAR 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ