Advertisement

త్రిషకు సారీ చెప్పిన డైరెక్టర్

ఈమధ్యన హీరోయిన్ త్రిష విషయంలో సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. హీరో విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉంది, అందుకే విజయ్ కి అతని భార్య సంగీత విడాకులిస్తుంది. విడాకుల సెటిల్మెంట్ పూర్తి కాగానే విజయ్ పబ్లిక్ గా త్రిష తో కలిసి పెళ్ళికి హాజరయ్యాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుంది.

అయితే త్రిష అలా విజయ్ తో పబ్లిక్ గా పెళ్ళికి వెళ్లడం పై కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలపై త్రిష ఇండైరెక్ట్ గా కౌంటర్ వేసింది. పార్తిబన్ ఓ ఈవెంట్ లో ఆమె (త్రిష)కొన్ని రోజులు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం మంచిది. ఎందుకంటే ఆమె బయటకు వస్తే ఎక్కడ లేని సమస్యలు వస్తున్నాయి అంటూ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.

ఆ కామెంట్స్ పై త్రిష ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయ్యింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏదిబడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు. అది మూర్ఖత్వమే అవుతుంది అంటూ త్రిష చేసిన కామెంట్స్ పై పార్తిబన్ సారీ చెబుతూ.. ఈ విషయంలో జరిగినదంతా తప్పుగా భావించారు. ఇప్పుడు నాకు పశ్చాత్తాపపడటం తప్ప మరో మార్గం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. 

Parthiban apologised for controversial remarks about actress Trisha

The director who apologized to Trisha
parthiban