నేనెవరిని టార్చర్ చెయ్యలేదు - షణ్ముఖ్

Shanmukh on Breakups Shanmukh on Breakups

యుట్యూబ్ తో తెగ పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తర్వాత వెబ్ సీరీస్, బిగ్ బాస్, అలాగే అనేక వివాదాలతో ఎక్కువగా మీడియాలో కనిపించేవాడు. బిగ్ బాస్ కి వెళ్లకుముందు దీప్తి సునయన తో ప్రేమలో ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సిరి హన్మంత్ ఫ్రెండ్ షిప్ వలన దీప్తి సునయన ను వదులుకోవాల్సి వచ్చింది. ఆమె షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోగా.. షణ్ముఖ్ ఒంటరిగా మిగిలిపోయాడు.

తర్వాత దీప్తి సునయన, షణ్ముఖ్ ఎవరి కేరీర్లో వారు బిజీ అవ్వగా.. తాజాగా షణ్ముఖ్ మరో అమ్మాయి ప్రేమలో పడి వైష్ణవి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తున్న షణ్ముఖ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్, అలాగే ఫ్యూచర్ లవ్, పెళ్లి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

దీప్తి సునయన తో బ్రేకప్ సమయంలో చాలా బాధపడ్డా, ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించాలి కదా, నా వల్ల తనకు బ్యాడ్ నేమ్ రాకూడదని అనుకుని ఆమెతో ఎప్పుడూ ఎందుకు బ్రేకప్ చెప్పావ్ అని అడగలేదు, ఒత్తిడి చెయ్యలేదు. అసలు ప్రేమను కోల్పోయిన తర్వాత ఎవ్వరిని ఇబ్బందిపెట్టలేదు. ఎవ్వరినీ టార్చర్ చేయలేదు. నా పని నేను చేసుకున్నా.

బ్రేకప్ తర్వాత ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఫోన్ లో ఫొటోలు చూస్తూ గడిపేవాడిని, ఆతర్వాత ప్రేమపై ఇంట్రెస్ట్ లేదు, అలాగే నమ్మకం పోయింది. ఆ సమయంలోనే నా లైఫ్ లోకి వైష్ణవి వచ్చింది. వైష్ణవి తో ప్రేమ అని కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి ప్రపోజల్ పెట్టాను, ఆమె ఒప్పుకుంది. త్వరలోనే మా పెళ్లి జరగబోతుంది. నా లైఫ్ లో జరిగిన బ్రేకప్ అన్ని విషయాలు వైష్ణవికి తెలుసు అంటూ షణ్ముఖ్ తన బ్రేకప్ పై ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యాడు. 

Shanmukh Jaswanth on Breakups and Life Partner

shanmukh