ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Raj-DK Plan Superhero Film with Salman Khan

భార్య స‌మంత‌తో అప్పుడే పెట్టుబ‌డా..

Raj-DK Plan Superhero Film with Salman KhanRaj-DK Plan Superhero Film with Salman Khan

స‌ల్మాన్ ఖాన్ క‌థానాయ‌కుడిగా రాజ్ అండ్ డీకే ఓ చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.ఓ హై కాన్సెప్ట్ సూప‌ర్ హీరో చిత్రంగా ప‌రిమిత బ‌డ్జెట్ లోనే నిర్మాణం ప్లాన్ చేస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్ ఈ విష‌యంలో స్ట్రిక్ట్ కండీష‌న్ పెట్టారు. భారీ గా ఖ‌ర్చు చేయోద్ద‌ని సింపుల్ బ‌డ్జెట్తో మంచి హిట్ చిత్రాన్ని ప్రేక్ష‌కుల‌కు అందిందామ‌ని ప్రామిస్ చేయించుకున్నారు. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, రీల్ లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా  చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

అయితే ఈ సినిమా నిర్మాణంలో స‌మంత కూడా భాగ‌స్వామి కాబోతుంద‌ని స‌మాచారం. 20 శాతం పెట్టుబ‌డి సినిమాలో పెట్టాల‌ని నిర్ణయించుకుందిట‌. మ‌రి ఇది స‌మంత ప్లానింగేనా?  లేక వెనుక మ‌రోక‌రు ఉన్నారా? అంటే భ‌ర్త రాజ్ నిడిమోరు  క‌నిపిస్తున్నాడు. ఇటీవ‌లే స‌మంత‌-రాజ్ నిడిమోరు ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వివాహ బంధంతో ధాంపత్య‌ జీవితంలోకి అడుగు పెట్టారు. పెళ్లైన త‌ర్వాత రాజ్ నిడిమోరు ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తోన్న తొలి చిత్ర‌మిదే.

దీంతో ఈ సినిమా నిర్మాణంలో పెట్టుబ‌డి పెడ‌దామ‌ని రాజ్ భావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో స‌మంత ముందుకు వెళ్తుంది. స‌మంత ఇప్ప‌టికే ట్రాలాలా అనే నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ‌లో `శుభ‌మ్` అనే చిత్రాన్ని నిర్మించింది. మ‌రో చిత్రం `మా ఇంటి బంగారం` ఆన్ సెట్స్ లో ఉంది. తాజాగా భ‌ర్త సినిమాతో బాలీవుడ్ కి సామ్ నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తుంది. అలాగే వెబ్ సిరీస్ లు కూడా ఇదే సంస్థ‌లో నిర్మించాల‌ని సామ్ భావిస్తోంది.

Salman Khan is reportedly in discussions with Raj and DK

salman khan