పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడు అనుకుంటాడు. కానీ ఆ అవకాశం కొందరికే వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చాలా మంది దర్శకులు పని చేసారు. అలా పనిచేసిన వారంతా చాలా గొప్పగా చెబుతుంటారు. ఏ హీరో విషయంలోనైనా డైరెక్టర్లు అంతే పాజిటివ్ గా స్పందిస్తారు. నెగిటివ్ గా మాట్లాడం అన్నది ఎక్కడా జరగదు.
మనసులో ఎన్ని ఉన్నా? సినిమా ఇండస్ట్రీలో అంతా పాజిటివ్ గా వెళ్లిపోతుంటారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు త్రివిక్రమ్ చేయగా, రెండేసి సినిమాలు పూరి జగన్నాధ్, హరీష్ శంకర్, ఎస్ జెసూర్య, భీమనేని శ్రీనివాసరావు , కరుణాకరన్, కిషోర్ కుమార్ పార్థసాని చేసారు. మిగతా దర్శకులంతా ఒక్కో సినిమా చొప్పున పనిచేసారు.
మరి వీళ్లందరిలో పవన్ తో ప్రశాంతంగా పనిచేసిన దర్శకులు ఎంత మంది అంటే? ఇద్దరే ఇద్దరు. వారే త్రివిక్రమ్, హరీష్ శంకర్. పవన్ తో త్రివిక్రమ్ ర్యాపో ఎంతో గొప్పగా ఉంటుంది. సినిమాల తద్వారా ఇద్దరు బెస్ట్ ప్రెండ్స్ అయిపోయారు. ఏరోజు ఇద్దరి మధ్య ఎలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ రాలేదు. ఒకర్ని ఒకరు ఎంతో గౌరవిం చుకుంటారు.
పీకే గురించి సమయం వచ్చిన సందర్భంలో గురూజీ స్పందన ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. `గబ్బర్ సింగ్` తర్వాత హరీష్ శంకర్ చాలా కాలానికి `ఉస్తాద్ భగత్ సింగ్` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. హరీష్ పై నమ్మకంతో అతడు ప్లాప్ ల్లో ఉన్న పవన్ సినిమా ఇచ్చాడు. పవన్ వ్యక్తిత్వం గురించి హరీష్ అంతే గొప్పగా చెబుతుంటాడు.త్రివిక్రమ్ తర్వాత పవన్ కు మరో నమ్మకస్తుడిగా హరీష్ శంకర్ కనిపిస్తున్నాడు.




అడక్కుండానే వస్తున్న వారణాసి అప్ డేట్స్ 

Loading..