కియారా అద్వానీ లేటెస్ట్ లుక్

Kiara Advani latest look viralKiara Advani latest look viral

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ గత ఏడాది అమ్మయ్యింది. సిద్దార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ లకు పాప పుట్టింది. రీసెంట్ గా సిద్దార్థ్ మల్హోత్రా తండ్రి, కియారా అద్వానీ మామగారు కాలం చేసారు. ఇక తల్లయ్యాక ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా కియారా అద్వానీ కెరీర్ లో బిజీ అయ్యింది.

కియారా అద్వానీ సౌత్ లో నటించిన టాక్సిక్ మూవీ ఈ నెల 19 న విడుదల కాబోతుంది. ఇప్పటివరకు కియారా నటించిన సౌత్ మూవీస్ ఏవి సక్సెస్ అవ్వలేదు. దానితో కియారా అద్వానీ లక్కు ఇప్పుడు టాక్సిక్ ద మూవీ రిజల్ట్ పైనే ఆధారపడివుంది. తల్లయ్యాక బయట పెద్దగా కనిపించని కియారా తాజాగా పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చింది.

తల్లయినా ఏ మాత్రం గ్లామర్ తగ్గని కియారా అద్వానీ న్యూ లుక్ అద్దిరిపోయిందీ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఫ్రాక్ లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని కియారా అందాలు ఆరబోసిన తీరుకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.

Kiara Advani new look viral

kiara advani