Advertisementt

పార్ట్ 1 కంటే ఆరు నిమిషాలు అధికంగా

Mon 02nd Mar 2026 10:42 AM
dhurandhar 2  పార్ట్ 1 కంటే ఆరు నిమిషాలు అధికంగా
Dhurandhar 2 పార్ట్ 1 కంటే ఆరు నిమిషాలు అధికంగా
Advertisement
Ads by CJ

ర‌ణవీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ధురంధ‌ర్ మొద‌టి భాగం భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.  సింగిల్ లాంగ్వేజ్ లోనే మొద‌టి భాగం 1300 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. మొత్తం ప‌ది చాప్ల‌ర్లుగా  మొద‌టి భాగం క‌థ‌ను డివైడ్ చేసి ఎంతో ఎంగేజింగ్ గా క‌థ‌ను న‌డించారు. సినిమా  మొత్తం  మూడు గంట‌ల 34 నిమిషాల నిడివితో రిలీజ్ అయింది.

ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చినా?  చాలా చోట్ల  సెన్సార్ క‌ట్స్ విధించింది. భారీ  హింస‌తో కూడిన కంటెంట్ కావ‌డంతో?  చాలా వ‌ర‌కూ రాగా చూపించినా? అవ‌స‌రమైన చోట క‌త్తెరకు పెద్ద ప‌నే ప‌డింది. ఆ సన్నివేశాల‌ను కూడా అంతే వైలెంట్ గా చూపించి ఉంటే మ‌రింత సంచ‌ల‌నంగా మారేది. ఇక ధురంధ‌ర్ 2 మార్చి 19న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈసారి పాన్ ఇండియాలో వివిధ భాష‌ల్లో రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది. మ‌రింత యాక్ష‌న్ అంశాల‌తో నిండిన కంటెంట్ గా చెప్పొచ్చు. తాజాగా ఈ సినిమా నిడివి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొత్తం మూడు గంట‌ల న‌ల‌భై నిమిషాల నిడివితో చిత్రం రిలీజ్ అవుతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే సెన్సార్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు , ఇంటెన్స్ డ్రామాతో సాగుతుంది. మొద‌టి భాగం కంటే ఆరు నిమిషాలు అధికంగా ఉంటుందని స‌మాచారం. మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగంలో కథా వేగం  ఎక్కువగా ఉంటుందని, క్లైమాక్స్ సుమారు 30 నిమిషాల పాటు హై-వోల్టేజ్ యాక్షన్‌తో సాగుతుందని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Dhurandhar 2:

Dhurandhar 2 Run Time

Tags:   DHURANDHAR 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ