Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan interesting update on Peddi

పెద్ది రూమర్స్ కి భలే చెక్ పెట్టారు

Ram Charan interesting update on Peddi

కొద్దిరోజులుగా పాన్ ఇండియా ఫిలిం పెద్ది ఏప్రిల్ 30 న విడుదలవుతుందా అనే సందేహాలు సోషల్ మీడియాలో ఎక్కువైపోతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, పోస్ట్ ప్రొడక్షన్ కి ప్రమోషన్స్ కి సమయం చాలదు, కాబట్టి పెద్ది పోస్ట్ పోన్ తప్పదు అంటూ కొంతమంది పనిగట్టుకుని ట్వీట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడా ఊహాగానాలకు పెద్ది ఫుల్ స్టాప్ పెట్టాడు.

పెద్ది సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి.

తాజాగా రామ్ చరణ్ పెద్ది డబ్బింగ్ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్ చెప్పిన ఏమది డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియోలో బుచ్చి.. చికిరి పాటలో మోహిత్ చౌహాన్ వాయిస్ కి నువ్వు ఎంత యాక్టింగ్ చేశావంటే.. నువ్వు పాడావా ఆయన పాడాడా? అనే డౌట్ వచ్చిందయ్యా.. నాకు డబ్బింగ్ లో కూడా అలా యాక్టింగ్ చేయమని చెప్పకు. డబ్బింగ్ నేనే చెప్పానండి అని బుచ్చిబాబుతో చరణ్ చెప్పడం నవ్వులు పూయించింది. 

ఈ వీడియో ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ది సెకండ్  సింగిల్ రై రై రారా మార్చి 2న రిలీజ్ కాబోతోంది.

Peddi - Ram Charan shares an interesting update

ram charan