విశ్వంభర మేలుకో

Vishwambhara movie release updaeVishwambhara movie release updae

మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు థియేటర్ నుంచి ఓటీటీ కి వచ్చేసింది. ఇప్పుడు బుల్లితెర పై ఎంట్రీ ఇస్తుంది. మరోపక్క మెగాస్టార్ - వసిష్ఠ కలయికలో ఎప్పుడో రావాల్సిన విశ్వంభర మాత్రం ఇంకా ఇంకా మరుగున పడిపోతుంది తప్ప తేలడం లేదు. దర్శకుడు వసిష్ఠ సీజీ వర్క్ అంటూ ఏళ్లకు ఏళ్ళు గడిపేస్తున్నారు. 

జూన్ రిలీజ్ లేదా జులై రిలీజ్ ఉంటుంది అని చిరు చెప్పి నెల కావొస్తుంది. కానీ మేకర్స్ విశ్వంభర రిలీజ్ డేట్ ఫైనల్ చెయ్యలేదు. మరోపక్క విశ్వంభర బిజినెస్ జరగాలంటే గూస్ బంప్స్ తెప్పించే ప్రమోషన్స్ చెయ్యాలి. విశ్వంభర టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా ఆపకుండా కిక్ ఇచ్చే కంటెంట్ వదలాలి.

కానీ వసిష్ఠ మాత్రం విశ్వంభర విషయంలో ఎందుకింతగా ఆలోచిస్తున్నారు. మరోపక్క స్వయంభు, నాగబంధం చిత్రాలు విడుదలైతే విశ్వంభర కు రిస్క్. ఇప్పటికే విశ్వంభర టీజర్ సీజీ వర్క్ పై విపరీతమైన ట్రోల్స్ చూసిన మెగా ఫ్యాన్స్ మరోసారి అలాంటి ట్రోల్స్ చూసేందుకు సిద్ధంగా లేరు. మరి మేలుకో విశ్వంభర మేలుకో అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. 

Vishwambhara movie

vishwambhara