యష్ టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్

Toxic Pre-Release BusinessToxic Pre-Release Business

కన్నడ స్టార్ హీరో యష్ కేజిఎఫ్ సీరీస్ తర్వాత చేసిన చిత్రం టాక్సిక్ ద మూవీ. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా మార్చి 19 న రాబోతున్న ఈ చిత్రం IMAX రిలీజ్ గా ఉండబోతుంది. ఈ చిత్రం పై పాన్ ఇండియా మార్కెట్ లో భీభత్సమైన అంచనాలున్నాయి. అందుకే ప్రతి భాషలోనూ టాక్సిక్ మూవీ థియేట్రికల్ రైట్స్ కి భారీ డిమాండ్ నెలకొంది.

తెలుగులోనే నిర్మాత దిల్ రాజు ఏకంగా టాక్సిక్ తెలుగు రైట్స్ ని 120 కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చి కమీషన్ బేస్‌పై సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఇక తమిళనాట టాక్సిక్ కి క్రేజ్ ఎక్కువైంది. తమిళనాట ఏరియాల వారీగా తమిళ్ రైట్స్ దాదాపుగా 63 కోట్ల రూపాయలకు అమ్ముడవడం హాట్ టాపిక్ అయ్యింది.

కేరళ వ్యాప్తంగా టాక్సిక్ ద మూవీ కి 30 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగినట్లుగా టాక్ వినిపిస్తుంది. టాక్సిక్ నార్త్ రైట్స్ 100 కోట్ల మేర అమ్ముడైనట్లుగా సమాచారం. ఇక టాక్సిక్ ద మూవీ కి ఓవర్సీస్ లో భారీ డిమాండ్ నెలకొంది. ఓవర్సీస్ లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను 105 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. 

మొత్తంగా యాష్ టాక్సిక్ అన్ని ఏరియాలకు కలిపి 500 కోట్ల మేర బిజినెస్ చేసినట్లుగా సమాచారం. 

Yash Toxic Pre-Release Business Details Out

yash