విష్ణు విన్యాసం - యావరేజ్ అయినా చాలు

Vishnu Vinyasam release tomorrowVishnu Vinyasam release tomorrow

శ్రీ విష్ణు ఈ ఏడాది ఒకేసారి రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తాడనుకున్నారు. రెండు సినిమాల డేట్స్ ఒక రోజు అటు ఇటుగా పెట్టారు. దానితో శ్రీ విష్ణు నటించిన ఏ సినిమా చూడాలో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారనుకున్నారు. కానీ మేకర్స్ విష్ణు విన్యాసం రేపు శుక్రవారం ఫిబ్రవరి 27 న విడుదల చేస్తుంటే, మరొకటి మృత్యుంజయ్ మార్చ్ రిలీజ్ అంటూ రిలీఫ్ నిచ్చారు.

రేపు విడుదల కాబోయే విష్ణు విన్యాసం పైనే ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కారణం ఫిబ్రవరి బాక్సాఫీసులో జోరు కనిపించలేదు, ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం వెయిటింగ్. విష్ణు విన్యాసం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లానే ఉంది, ప్రమోషన్స్ లోను శ్రీవిష్ణు కామెడీ పంచ్ లు పేలిపోతున్నాయి. టీజర్, ట్రైలర్ అన్ని సినిమాపై హోప్స్ పెంచుతున్నాయి.

ఒకవేళ విష్ణు విన్యాసానికి జస్ట్ యావరేజ్ టాక్ పడినా చాలు ఆడియన్స్ రిలాక్స్ అవుతారు. విష్ణు విన్యాసాన్ని పైకి లేపుతారు. అందులోను విష్ణు విన్యాసానికి ఈ వారం పోటీ లేదు. కేవలం విష్ణు దే అన్నట్టుగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. విష్ణు విన్యాసానికి అదే అడ్వాంటేజ్ కానుంది. మరి దర్శకుడు, హీరో, హీరోయిన్స్ ఈ చిత్రాన్ని ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా కష్టపడ్డారు. వారి కష్టానికి విష్ణు విన్యాసం మంచి ఫలితాన్ని అందించాలని కోరుకుందాం.

విష్ణు విన్యాసం అదిరిపోయే నిడివి తో రాబోతుంది. 1 అవర్ 59 మినిట్స్ క్రిస్పీ రన్ టైమ్ తో శ్రీవిష్ణు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. 

Sree Vishnu Vishnu Vinyasam release tomorrow

sree vishnu