అనుకోవడం కాదు.. ఆచరించాలి

Tollywood Eyes 8-Week OTT WindowTollywood Eyes 8-Week OTT Window

థియేట్రికల్ రిలీజ్ ల కన్నా ఎక్కువగా ఓటీటీ డీల్ పైనే నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్ రిలీజ్ ల్లో తేడా కొట్టినా ఓటీటీ డీల్స్ తో బయటపడిపోవచ్చు అంటూ మొత్తం తీసుకెళ్లి ఓటీటీ చేతుల్లో పెడుతున్నారు మేకర్స్. ఓటీటీ డీల్ తర్వాత అవి చెప్పిన తేదీలకే రిలీజ్ లు, మూడు నుంచి నాలుగు వారాల గ్యాప్ లో థియేటర్స్ నుంచి ఓటీటీ కి రావడాలు ఇలా మొత్తం ఓటీటీ లే డిసైడ్ చేస్తున్నాయి. 

హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా మూడు నుంచి నాలుగు వారాలకే థియేటర్స్ నుంచి ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. అలాంటి సమయంలో ప్రేక్షకులు వేలకు వేలు పోసి థియేటర్స్ కి ఎందుకు వెళతారు, వారు కూడా హా నాలుగు వారాలు ఆగితే ఓటీటీ లో చూడొచ్చని ఫిక్స్ అవుతున్నారు. దానితో థియేటర్ రెవిన్యూ తగ్గిపోతుంది. థియేటర్ వ్యవస్థను చేజేతులా నిర్మాతలే చంపుకుంటున్నారు.

మొదట్లో ఎనిమిదివారాల డీల్ తో ఓటీటీ లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు మూడు, లేదా నాలుగు వారాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ చూపు ఎనిమిదివారాల డీల్ పై పడింది అని, ఏ సినిమా అయినా థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల్లోనే ఓటీటీ కి ఇవ్వాలని చూస్తున్నారట.

మరి ఇది మంచి పరిణామం. కాకపోతే అనుకోవడం కాదు నిజంగా ఈ ఎనిమిది వారాల డీల్ ని ఆచరించగలగాలి. 

Telugu Film Industry Eyes 8-Week OTT Window

tollywood