పాన్ ఇండియా స్టార్స్ కి పోటీగా నాని

Nani to compete with Pan India StarsNani to compete with Pan India Stars

హీరో నాని బర్త్ డే నిన్న మంగళవారం ఫిబ్రవరి 24. నాని బర్త్ డే కి పలువురు ప్రముఖులు, ఆయన అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీస్ ద ప్యారడైజ్, బ్లడీ రోమియో నుంచి అదిరిపోయే కాదు కాదు గూస్ బంప్స్ తెప్పించే అప్ డేట్స్ వచ్చాయి.

స్టార్ హీరోల కు పోటీగా, పాన్ ఇండియా స్టార్స్ కి ధీటుగా నాని సినిమాల అప్ డేట్స్ గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకుంది. ఇప్పటికి నాని ప్యారడైజ్ సాంగ్ లోని డాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నాని బర్త్ డే సందర్భంగా నాని కోసం నిర్మాతలు క్యూ కట్టారు. 

నాని బర్త్ డే రోజున నాని ని అటు ఇటుగా ఓ 30 మంది ప్రొడ్యూసర్స్ కలిసి పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలపడం హాట్ టాపిక్ అయ్యింది. మరి బర్త్ డే లకు ఎంతమంది ప్రొడ్యూసర్స్ హీరోలను కలుస్తారో అదే హీరో రేంజ్ ఏమిటో తెలిపే సమయమిది. మరి నాని బర్త్ డే కి కలిసిన నిర్మాతల లెక్కే ఆయన స్టామినా ఏమిటో తెలియజేస్తుంది. 

ఇక నాని కెరీర్ ఇప్పటివరకు ఒక ఎత్తు, ఈ బర్త్ డే కి వచ్చిన రెండు పాన్ ఇండియా మూవీస్ అడుగులు ఒక ఎత్తు అంటూ సోషల్ మీడియా మొత్తం నాని గురించిన చర్చే. 

Hero Nani

nani