పెద్ది ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి

Peddi Promotions Peddi Promotions

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్-ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రం విడుదలకు రెండు నెలల సమయం ఉంది. ఇంకా కొద్దిమేర షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో బుచ్చిబాబు డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఒక డేట్ మారడంతో ఇప్పుడు ఇచ్చిన ఏప్రిల్ 30 కి అయినా సినిమాని తీసుకునిరావాలనే పట్టుదలతో పై చేస్తున్నాడు.

ఇక పెద్ది షూటింగ్ అలాగే మిగతా వర్క్ కంప్లీట్ చేసేసి మార్చి 27 నుంచి అంటే రామ్ చరణ్ బర్త్ డే రోజు నుంచి పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో బుచ్చిబాబు ఉన్నాడట. సినిమాని మార్చి 27 న రిలీజ్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ డేట్ నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలనుకుంటున్నారట.

రామ్ చరణ్ బర్త్ డే కి దిమ్మ తిరిగే ట్రీట్ ఇస్తూనే పెద్ది ని పాన్ ఇండియా మార్కెట్ లో ప్రమోట్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈలోపే పెద్ది సెకండ్ సింగిల్ వదిలేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ శివ రాజ్ కుమార్ లు పెద్ది ప్రమోషన్స్ లో పాల్గొనున్నారని తెలుస్తుంది. 

Ram Charan Birtrhday

peddi