రష్మిక బాటలో రుక్మిణి వసంత్

Rukmini Vasanth entered BollywoodRukmini Vasanth entered Bollywood

కన్నడ భామలు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్స్ ని శాసిస్తున్నారు. కన్నడ నుంచి వచ్చిన రష్మిక మందన్న తెలుగు, కన్నడ, హిందీ ఇలా ఏ భాషను వదలకుండా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. గ్లామర్ షో, యాక్టింగ్ లోను నెంబర్ 1 గా మారి టాప్ హీరోల సరసన చోటు దక్కించుకున్న రష్మిక మందన్న ఇప్పుడు నార్త్ లో అంటే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ కి పోటీగా తయారైంది.

అదే కన్నడ నుంచి వస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు రష్మిక బాటలోనే నడవడానికి సిద్దమవుతుంది అని తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్స్ సరసన నటిస్తున్న రుక్మిణి వసంత్ కాంతార 2 తో పాన్ ఇండియా మార్కెట్ లో తన మార్క్ చూపించింది. ప్రస్తుతం యష్ టాక్సిక్ లోను, ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలో నటిస్తుంది.

ఇప్పుడు ఈ భామ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే వార్త వైరల్ అవుతోంది. రుక్మిణి వసంత్ కి నార్త్ నుంచి కిల్ ఫేమ్ నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ సరసన ఛాన్స్ వచ్చింది అని, రుక్మిణి వసంత్ కూడా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈవిషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి రష్మిక లా రుక్మిణి వసంత్ కూడా బాలీవుడ్ లో జెండా పాతుతుందేమో చూడాలి.

Rukmini Vasanth

rukmini vasanth