Advertisementt

మీనాక్షి వెంటపడుతున్న ఆ ఇద్దరు

Tue 17th Feb 2026 10:22 AM
meenakshi chaudhary  మీనాక్షి వెంటపడుతున్న ఆ ఇద్దరు
Meenakshi Chaudhary మీనాక్షి వెంటపడుతున్న ఆ ఇద్దరు
Advertisement
Ads by CJ

గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో రూ.300 కోట్ల క్లబ్బులోకి వెళ్లి లక్కీ హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి ఈఏడాది అదే సంక్రాంతికి అనగనగ ఒక రాజు తో రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరింది. ప్రస్తుతం నాగ చైతన్య తో వృషకర్మ చిత్రంలో నటిస్తున్న మీనాక్షి చౌదరి వెంట ఇద్దరు యువ హీరోలు పడుతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ అప్ కమింగ్ మూవీ లో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా అనుకుంటున్నారట. అంతేకాకుండా నాని-వెంకీ అట్లూరి కలయికలో అనౌన్స్ కాబోతున్న మూవీలోను మీనాక్షి చౌదరి నే హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ రెండు సినిమాల దర్శకులు మీనాక్షి చౌదరితో సంప్రదింపులు జరుపుతున్నారట.

మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ గనక మీనాక్షి చౌదరి సొంతమైతే ఇక ఆమె లక్కీ హీరోయిన్ కాక మరేమవుతుంది.

Meenakshi Chaudhary:

Meenakshi Chaudhary

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ