ఇంజ్యూరీ ని లెక్క చెయ్యని ప్రభాస్

Prabhas met with minor injuryPrabhas met with minor injury

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ టైమ్ లో మోకాలి నెప్పితో ఇబ్బంది పడి నీ సర్జరీ చేయించుకున్నారు. ఆతర్వాత ప్రభాస్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి తో ఫౌజీ చిత్రం అలాగే సందీప్ రెడ్డి వంగ తో స్పిరిట్ చిత్రాలని సిమిలర్ గా చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి తో ఫౌజీ సెట్ లో ఉన్నారు. చౌటుప్పల్ దగ్గర జరుగుతున్న షూటింగ్ సెట్ లో ప్రభాస్ ఈరోజు జరిగిన ఓ యాక్షన్ సీన్ లో భాగంగా హార్స్ రైడింగ్ షూట్ జరుగుతుండగా.. ప్రభాస్ కి చిన్న ఇంజ్యూరీ జరిగినట్లుగా తెలుస్తుంది. అది చిన్న ప్రమాదమే అని, పెద్ద సీరియస్ ఏమి లేదు అని సమాచారం.

అయితే ఈరోజు కు షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి ప్రభాస్ కి రెస్ట్ ఇచ్చినా... రేపటి నుండి ప్రభాస్ యధావిధిగా మళ్లీ ఫౌజీ షూట్ కి వస్తారు అని తెలుస్తుంది. సో నథింగ్ టు వర్రీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎలాంటి ఆందోళన వద్దు, ప్రభాస్ సేఫ్. కానీ దెబ్బ తగిలినా.. వెంటనే కోలుకుని ప్రభాస్ మళ్ళీ షూటింగ్ రావడం పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన డెడికేషన్ ను తెగ మెచ్చేసుకుంటున్నారు. 

Prabhas suffers minor injury

prabhas