ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sukesh Chandrashekhar surprises Jacqueline Fernandez

జాకీకి జైలు నుంచే హెలీకాఫ్ట‌ర్ కానుక‌

Sukesh Chandrashekhar surprises Jacqueline FernandezSukesh Chandrashekhar surprises Jacqueline Fernandez

అత‌డు జైలు నుంచే త‌న ప్రేయ‌సికి ప్రేమికుల‌రోజు కానుక పంపాడు. అది కూడా అలాంటిలాంటి కానుక కాదు. ఏకంగా 30 కోట్ల ఖ‌రీదు చేసే హెలీకాఫ్ట‌ర్ కానుకిస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు. బేబి.. నీకోసం ఇది నా ప్రేమ కానుక! అంటూ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని ఉద్ధేశించి కాన్ మాన్ సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వేడెక్కిస్తోంది.

జైలు నుంచే సుకేష్ వ‌రుస‌గా ప్రేమ‌లేఖ‌లు రాస్తూ జాక్విలిన్ ని ఆట‌ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లుమార్లు జాకీని బేబి అంటూ సంభోధిస్తూ ప్రేమ కానుక‌లు స‌మ‌ర్పించాడు. త‌న కోసం ఒక సొంత ఇల్లు సిద్ధంగా ఉంద‌ని, తాను జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌, అక్క‌డ తాము ఆనందంగా జీవిస్తామ‌ని సుకేష్ గ‌తంలో వెల్ల‌డించాడు. ఓసారి త‌న కోసం ఒక యాచ్ (ప‌డ‌వ‌) కానుక‌గా ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించాడు.  

అయితే అత‌డిని ఆపాల‌ని కోర్టుకు వెళ్లారు జాక్విలిన్. అయినా వ‌రుస‌గా ప్రేమ‌లేఖ‌లు రాస్తూనే ఉన్నాడు.. ఇంత‌కుముందు కార్ బంగ్లా లాంటి ఖ‌రీదైన కానుక‌లు ఇస్తున్నాన‌ని క‌లిసి కాపురం చేద్దామ‌ని సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ అన్నాడు.. ఇప్పుడు ఏకంగా 30 కోట్ల ఖ‌రీదైన హెలీకాఫ్ట‌ర్‌నే కానుక‌గా ప్ర‌క‌టించాడు..అయితే ఈ కానుక అందుకోవ‌డానికి జాక్విలిన్ సిద్ధంగా ఉందా? అంటే.. అందుకు ఆస్కార‌మే లేదు. అత‌డి నుంచి దూరంగా ఉండేందుకు, అత‌డి వేధింపుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు కోర్టుల్లో పోరాడుతోంది. సుకేష్ తో స్నేహం కార‌ణంగా కొన్ని కానుక‌లు అందుకున్నందుకు ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కుంది జాక్విలిన్. 

అందుకే ఇప్పుడు అప‌రాధం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. జాక్విలిన్ ఇంత‌కుముందు ప్ర‌భాస్ `సాహో` చిత్రంలో బ్యాడ్ బోయ్ సాంగ్ లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న కిక్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం వెల్ కం టు ది జంగిల్ అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తోంది. మ్యాట్రిక్స్ ప్ర‌మోట‌ర్స్ ని 200కోట్ల మేర మోసం చేసిన కేసులో సుకేష్ చంద్ర‌శేఖ‌ర్ అరెస్ట‌య్యాడు. అత‌డు త‌న సెల‌బ్రిటీ క‌మ్యూనికేష‌న్ ని ఉప‌యోగించి త‌ప్పుడు విధానంలో కోట్ల‌లో ఆర్జించాడ‌ని ద‌ర్యాప్తులో తేలింది.  

Sukesh Chandrasekhar Sends Airbus Helicopter Gift to Jacqueline Fernandez

jacqueline