రిలీజ్ డేట్ దాచేసిన లెనిన్

Lenin hides release dateLenin hides release date

ఏప్రిల్ 30 కి రామ్ చరణ్ పెద్ది రిలీజ్ డేట్ రావడంతో మే 1 రిలీజ్ అంటూ ప్రకటించిన అఖిల్ లెనిన్ మూవీ మేకర్స్ ఇప్పుడు డైలమాలో పడ్డారు. పెద్ది తో పోటీ అవసరమా అని బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. లెనిన్ మేకర్స్ కూడా లెనిన్ పై ఎంత నమ్మకం ఉన్నా పెద్ది తో మాత్రం పోటీపడేంత సినిమా లేదు వాళ్లకు.

నిన్నటివరకు లెనిన్ అప్ డేట్ ఏది వచ్చినా లెనిన్ మే 1 రిలీజ్ అన్న మేకర్స్ ఈసారి అంటే నిన్న వాలెంటైన్స్ డే రోజున వదిలిన రొమాంటిక్ పోస్టర్ లో మాత్రం లెనిన్ రిలీజ్ డేట్ విషయం సస్పెన్స్ లో అంటే దాచేసారు. లెనిన్ మే 1 న వస్తుందా, రాదా అనే కన్ఫ్యూజన్ లోకి అభిమానులను తోసేశారు.

వాలెంటైన్స్ డే రోజున అఖిల్ -హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సైకిల్ పై రొమాంటిక్ గా కనిపించారు. అఖిల్ మాసివ్ లుక్, భాగ్యశ్రీ బోర్సే విలేజ్ లుక్ ఆకట్టుకున్నాయి. ఈ లెక్కన అఖిల్ లెనిన్ రిలీజ్ డేట్ విషయంలో అక్కినేని అభిమానులు అయోమయంలో కనిపిస్తున్నారు. 

Akhil Lenin

lenin