భారతీయ చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ సాధించిన విజయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. వెండి తెరపై ఆయన చేయని ప్రయోగం లేదు. పోషించని పాత్ర లేదు. అందుకోని అవార్డు లేదు. ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు సేవలందిస్తున్నారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఓ లెజెండరీ నటుడు.
ఆ లెజెండ్ ను అభిమానులు ఎన్నో రకాలుగా ఎంతో ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆప్యాయంగా , గౌరవంగా `ఉలగనాయగన్`. ఎక్కువగా కమల్ ముందు ఇలాగే సంబోదిస్తారు. నమ్మవర్ అని కూడా ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. అంటే `మనవాడు` అని అర్దం.
ఆయన నటించిన ఒక సినిమా టైటిల్ కూడా ఇదే. అభిమానులు ఆయన్ని తమ సొంత మనిషిగా భావిస్తూ ఇలా పిలుస్తుంటారు. అలాగే సకలకలా వల్లవన్ అంటారు. నటన, దర్శకత్వం, గానం, నృత్యం ఇలా అన్ని కళల్లో ప్రావీణ్యం ఉన్నందుకు ఆయన్ని `సకలకలా వల్లభుడు` అని తెలుగులో పిలుస్తారు.
`విశ్వరూప నాయకన్` అని మరో బిరుదు కూడా ఉంది. అంటే ఆయన నటనలోని వైవిథ్యత ఆధారంగా అలా పిలుచుకుంటారు. కమల్ ఇప్పటికే నటుడిగా 236 చిత్రాల్లో నటించారు. 237 వ చిత్రంలో నటిస్తున్నారు. కమల్ వయసెంతో తెలుసా? ఇప్పటికే 70 ఏళ్లు దాటింది. అయినా? 30 ఏళ్ల నటుడిలా ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తారు.





కాంప్రమైజ్ కి వస్తున్న జన నాయకుడు 
Loading..