Advertisementt

మ‌ళ్లీ క్లాసిక్ బాట ప‌ట్టిన న‌యా డైరెక్ట‌ర్

Tue 10th Feb 2026 08:45 AM
gowtam tinnanuri  మ‌ళ్లీ క్లాసిక్ బాట ప‌ట్టిన న‌యా డైరెక్ట‌ర్
Gowtam Tinnanuri మ‌ళ్లీ క్లాసిక్ బాట ప‌ట్టిన న‌యా డైరెక్ట‌ర్
Advertisement
Ads by CJ

`మ‌ళ్లీ రావా`తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన గౌత‌మ్ తిన్న‌నూరి  తొలి సినిమాతోనే క్లాసిక్ డైరెక్ట‌ర్ గా ఫేమ‌స్ అయ్యాడు. ప్లాప్ ల్లో ఉన్న సుమంత్ కు ఆ విజ‌యంతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ సక్సెస్ ను మాత్రం కొన‌సాగించ‌లేక‌పోయాడు. కానీ డైరెక్ట‌ర్ కుకి మాత్రం అవ‌కాశాలు వ‌చ్చాయి. అత‌డి ప్ర‌తిభ‌ను గుర్తించిన నాని  వెంట‌నే లాక్ చేసాడు.

ఆ ఇద్ద‌రి కాంబినేష‌ల్ లో  `జెర్సీ` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన సినిమా మంచి విజ‌యం  సాధించింది. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లోనూ రిమేక్ చేసి స‌క్సెస్ అందుకున్నాడు. ఇలా రెండు క్లాసిక్ హిట్స్ త‌ర్వాత  గౌత‌మ్ ఆలోచ‌న మారింది. తానెందుకు క‌మ‌ర్శియ‌ల్ సినిమా తీయ‌కూడ‌ద‌నుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో?  కింగ్ డ‌మ్ అనే యాక్ష‌న్ అటెంప్ట్ చేసి చేతులు కాల్చుకున్నాడు. గౌత‌మ్ శైలికి పూర్తి భిన్న‌మైన సినిమా ఇది. అనుకున్న విధంగా ఫ‌లితాలు రాలేదు. దీంతో తాజాగా మ‌ళ్లీ త‌న క్లాసిక్ వ‌ర‌ల్డ్ లోకే బ్యాక్ అయ్యాడు. ప్ర‌స్తుతం మ్యాజిక్ అనే ఓ మ్యూజిక‌ల్ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మెయిన్ లీడ్ లో సారా అర్జున్ న‌టిస్తోంది.

ఆమెతో పాటు మ‌రో న‌లుగురు కొత్త న‌టుల్నీ తీసుకుని తెర‌కెక్కిస్తున్నాడు. సంగీత ప్ర‌ధాన చిత్రం కావ‌డంతో అనీరుద్ ని  తీసుకున్నాడు. రెండున్నర ద‌శాబ్దాల క్రితం సాగే ఓ పీరియాడిక్ కాన్సెప్ట్ ఇది. కాలేజీ ఫెస్ట్ కోసం ఒక ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేయాలనే లక్ష్యంతో ఈ కుర్రాళ్లు పడే తపన, వారి ప్రయాణమే ఈ చిత్రం.

Gowtam Tinnanuri:

Director Gowtam Tinnanuri

Tags:   GOWTAM TINNANURI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ