Advertisementt

ప్రభాస్ రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది

Sun 08th Feb 2026 09:49 AM
prabhas  ప్రభాస్ రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది
Prabhas ప్రభాస్ రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వని రోజు లేదు. ప్రభాస్ ఫిట్ నెస్ పరంగా ఎలా ఉన్నా ప్రభాస్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, గ్లో కానివ్వండి మిస్ అయ్యాయి. రాజసాబ్ లో మారుతి ని ఎంతగా ప్రభాస్ ఫ్యాన్స్ టార్గెట్ చేసారో, ప్రభాస్ లుక్స్ విషయంలో ఓటీటీ వెర్షన్ చూసాక ఫ్యాన్స్ అంతే డిజప్పాయింట్ అవుతున్నారు.

థియేటర్స్ లో సీన్ టు సీన్ ఏమో కానీ.. ఓటీటీలోకి వచ్ఛాక రాజసాబ్ సీన్స్ ని, ప్రభాస్ లుక్స్ ని నిశితంగా పరిశీలిస్తూ యాంటి ఫ్యాన్స్ వేస్తోన్న ట్వీట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు. సినిమా రిజల్ట్ పక్కనపెట్టి ప్రభాస్ లుక్స్ విషయంలో, ఆయన బాడీ డబుల్ విషయంలో, ఇంకా ఎక్స్ప్రెషన్స్ విషయమే కాదు ప్రభాస్ వాయిస్ కూడా వినలేకపోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. 

యాక్షన్ సీన్స్ లో బాడీ డబుల్స్ వాడితే ఓకే కానీ సాంగ్స్ లోను, ఇంకా కొన్ని సీన్స్ లో ప్రభాస్ బాడీ డబుల్ వాడేశారు, అందుకే ప్రభాస్ అంత ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారన్నారని కాదు కానీ.. ప్రభాస్ క్లోజప్ షాట్స్ చూస్తే సీజీ లో చేసారు అనిపిస్తుంది.

ప్రభాస్ సినిమా ఒప్పుకుంటే చాలు బాడీ డబుల్ తో పని కానిచేద్దామనే దర్శకులు ఎక్కువయ్యారు, కానీ సందీప్ వంగ విషయంలో అలా జరగదు.. సందీప్ ఖచ్చితంగా ప్రభాస్ తోనే సీన్స్ చేస్తారు తప్ప బాడీ డబుల్ తో ఆయన పని చెయ్యరు అంటున్నారు. చూద్దాం స్పిరిట్ వచ్చాక ఆ విషయం ఎలా ఉంటుందో అనేది.

ఈ లుక్స్ విషయంలో ప్రభాస్ రియలైజ్ అవ్వాల్సిన టైమ్ వచ్చేసింది. సాహో దగ్గర నుంచి రాధేశ్యామ్, ఆదిపురుష్ కల్కి ఇలా అన్ని సినిమాల్లో ప్రభాస్ లుక్స్ విషయంలో తీవ్ర విమర్శలొచ్చాయి. రాజసాబ్ కి అది మరింత పరాకాష్టకు చేరింది అంతే. 

Prabhas:

Prabhas Gets Trolled For Excessive Use Of Body Doubles

Tags:   PRABHAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ