ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli Record Breaking Remuneration For Varanasi

వారణాసి - వారిద్దరికి దిమ్మతిరిగే పారితోషికం

Rajamouli Record Breaking Remuneration For Varanasi

భారీ బడ్జెట్ మూవీ వారణాసి చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ విభిన్నంగా రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసి మూవీ ఇప్పటినుంచే వార్తల్లో నిలుస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన రాజమౌళి మరియు మహేష్ అండ్ టీమ్ వారణాసి కి సంబందించిన పలు విషయాలు రివీల్ చేసేశారు. 

ఇకపోతే ఈ చిత్రానికి రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అందుకోబోతున్న పారితోషికాలపై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ నడుస్తుంది. వారణాసి చిత్రానికి గాను రాజమౌళి ఓవర్సీస్ హక్కులు  తీసుకుంటున్నారట. దాని విలువ దాదాపుగా రూ.150 కోట్లకు పైమాటే అంటున్నారు. 

ఇక మహేష్ కూడా వారణాసిలో భాగమే అంటే పార్ట్నర్ కాబట్టి మహేష్ కి ఓ రూ.200 కోట్ల వరకు వర్కౌట్ అవ్వొచ్చని తెలుస్తుంది. సో రాజమౌళి కి వారణాసి కి రూ.150 కోట్లకు అటు ఇటుగా, మహేష్ కి రూ.200 కోట్లకు అటు ఇటుగా గిట్టుబాటు అవుతుంది. మరి ఇది షాకింగ్ రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఇక పృథ్వీరాజ్, ప్రియాంక లకు ఇవ్వబోయే ఆ పారితోషికాలు ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి. 

Mahesh Record Breaking Remuneration For Varanasi

mahesh