NBK 111 స్టోరీ లైన్ పై క్రేజీ న్యూస్
Crazy news on NBK 111 story lineఅఖండ తాండవం రిజల్ట్ తర్వాత బిగ్ బ్రేక్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ మార్చి లో మొదలు కాబోయే గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న NBK 111 ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ముందుగా పిరియాడికల్ డ్రామాగా NBK 111 కథ ఉంటుంది అన్నా బడ్జెట్ ఇష్యుస్ తలెత్తడంతో గోపీచంద్ మలినేని మరో కథ ను రెడీ చేసి బాలయ్య ను ఇంప్రెస్స్ చేసాడు.
NBK111 ఫ్యామిలీ స్టోరీ లో యాక్షన్ ఎలిమెంట్స్ కలగలిపి ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో గోపీచంద్ మలినేని బిజీగా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య తో నయనతార హీరోయిన్ గా నటించనుంది.
NBK 111 మార్చ్ లో మొదలై వచ్చే ఏడాది అంటే 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో గోపీచంద్ మలినేని ఇంకా నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
NBK 111 update
nbk 111






































