పెద్ది కోసం పేలిపోయే ఐటమ్ గర్ల్

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్నారు. మార్చి 7 న పెద్ది మూవీ రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటిస్తూనే ఉన్నారు. తాజాగా పెద్ది కోసం బుచ్చిబాబు అదిరిపోయే స్కెచ్ వేసారట. హీరోయిన్ గా జాన్వీ కపూర్ తో రొమాన్స్ చేస్తూ డ్యూయెట్స్ వేసుకునే చరణ్ కోసం ఇప్పుడొక ఐటమ్ గర్ల్ ని తీసుకురాబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.

సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఎంత స్పెషల్ గా ఉంటాయో అంతకు మించి అనేలా శిష్యుడు బుచ్చిబాబు పెద్ది లో ఐటమ్ సాంగ్ ని సెట్ చేసాడట, రెహమాన్ ఆల్బమ్ లో పెద్ది నుంచి రాబోయే ఈ ఐటెం సాంగ్ చాలా స్పెషల్ గా ఉండబోతుంది అని, అందుకోసం బుచ్చిబాబు సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఎంపిక చేస్తున్నట్లుగా టాక్ వినబడుతుంది.

ఆమె సినిమాల్లో ఎంత ట్రెడిషనల్ గా ఉన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షో చూస్తే షాకవ్వాల్సిందే. అందుకే పెద్ది లో రామ్ చరణ్ మాస్ స్టెప్పులకు తోడు మృణాల్ గ్లామర్ తోడైతే ఆ సాంగ్ వేరే లెవల్ ల్లో హిట్ అవడం ఖాయమంటున్నారు. ఇప్పటికే పెద్ది ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి సెన్సేషనల్ హిట్ అవడంతో ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ పై విపరీతమైన క్రేజ్ మొదలయ్యింది. 

Mrunal Thakur To Shake Leg With Ram Charan In A Special Song From Peddi

Mrunal Thakur to Sizzle In Peddi
mrunal thakur