ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Actress rejected Billionaire Love for her career

కెరీర్ కోసం గోల్డ్ మైన్ కోల్పోయిన న‌టి

Actress rejected Billionaire Love for her careerActress rejected Billionaire Love for her career

 

హీరోల‌తో డేటింగ్ చేయ‌డం కొత్త కాదు. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కుమారుడితోను ప్రేమ‌లో ప‌డ్డానని స్వ‌యంగా అంగీక‌రించింది ఈ క‌థానాయిక‌. అంతేకాదు.. 50 వ‌య‌సులోను త‌న‌లో స‌గం వ‌య‌సున్న కుర్రాళ్లు త‌న‌కు లైనేస్తున్నార‌ని, డేటింగ్ కి పిలుస్తున్నార‌ని బోల్డ్ గా చెబుతోంది. చాలామంది కుభేరులు త‌న‌ను పెళ్లాడేందుకు ప్ర‌పోజ్ చేసార‌ని కానీ త‌న మ‌న‌సును దోచుకునేవాడి కోసం వెతుకుతున్నాన‌ని చెబుతోంది.

యాభై దాటినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఇలాంటివి చాలా చెప్పుకొచ్చింది. ఇన్నేళ్ల‌లో తన‌ను చాలా మంది ప్రేమించార‌ని, ప్ర‌పోజ్ చేసార‌ని కానీ తాను మాత్రం పెళ్లికి నో చెప్పాన‌ని కూడా చెప్పింది. ద‌క్షిణ ముంబైకి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కుమారుడు త‌న‌ని ప్రేమించాడ‌ని, పెళ్లికి కూడా ప్ర‌పోజ్ చేసాడని తాజా పాడ్ కాస్ట్ లో గుర్తు చేసుకుంది.

అయితే పెళ్లి త‌ర్వాత న‌టించ‌కూడ‌ద‌ని కండిష‌న్ పెట్టాడు. అందువ‌ల్ల అత‌డిని వ‌దిలేసి కేవ‌లం న‌ట‌నా కెరీర్ గురించే ఆలోచించాన‌ని కూడా బోల్డ్ గా చెప్పింది. ఇదంతా న‌టిగా కెరీర్ ప్రారంభం కాక మునుప‌టి వ్య‌వ‌హారాలు.

ఈ బోల్డ్ బ్యూటీ అటు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ప‌లు చిత్రాల్లో న‌టించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ లాంటి స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. కానీ ఇటీవ‌లి కాలంలో కెరీర్ ప‌రంగా చాలా ట్ర‌బుల్స్ ని ఎదుర్కొంటోంది. ప్ర‌స్తుతం ఒక్క ఛాన్స్ ప్లీజ్! అనాల్సిన స్థితికి దిగ‌జారింది.

 

Guess the actress who rejected Billionaire for her career

actress rejected billionaire