లెనిన్: శ్రీలీల అవుట్-భాగ్యశ్రీ ఇన్

అక్కినేని అఖిల్ లెనిన్ చిత్రంలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల తన దురదృష్టాన్ని తనే కొనితెచ్చుకుంది. టాలీవుడ్ లో వరసగా నిరాశపరిచే సినిమాలు పడడంతో కెరీర్ క్లోజ్ అనుకున్న సమయంలో శ్రీలీల కు అఖిల్ లెనిన్ లో ఛాన్స్ వచ్చింది, అమ్మడు మళ్లీ ట్రాక్ లో పడింది అనుకున్నారు. మరోపక్క హిందీ అవకాశాలు శ్రీలీల ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
దానితో శ్రీలీల టాలీవుడ్ ప్రిన్స్ అఖిల్ తో నటించే విషయంలో తికమక పడి లెనిన్ కి డేట్స్ కేటాయించే విషయంలో అలసత్వం చూపించడంతో లెనిన్ మేకర్స్ నిర్ధాక్షిణ్యంగా శ్రీలీల ను లెనిన్ నుంచి తప్పించారు. శ్రీలీల ప్లేస్ లో అఖిల్ సరసన మరో లక్కీ హీరోయిన్ కి ఛాన్స్ దొరికింది. ఆమె ఎవరో కాదు డిజాస్టర్ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే.
మొదటి సినిమాతో బిగ్ ప్లాప్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే కి టాలీవుడ్ హీరోలు వరస అవకాశాలు ఇస్తున్నారు. ఆమె నటించిన కింగ్ డమ్ విడుదలకు రెడీ అవ్వగా... రామ్ ఆంధ్ర తాలూకా కింగ్ చిత్రంలోను నటిస్తుంది. ఇప్పుడు శ్రీలీల తప్పుకున్న అఖిల్ లెనిన్ లోకి భాగ్యశ్రీ బోర్సే అఫీషియల్ గా క్రేజీగా అడుగుపెట్టడం ఆమె అదృష్టానికి నిదర్శనమనే చెప్పాలి.
అలా లెనిన్ నుంచి శ్రీలీల అవుట్ అవ్వగా భాగ్యశ్రీ బోర్సే ఇన్ అయ్యింది. అఖిల్ తో రొమాన్స్ చేసే అవకాశం కొట్టేసింది.
Sreeleela Out: Bhagyashree Borse to Romance Akhil Akkineni in Lenin
Lenin: Sreeleela out- Bhagyashree in








































