Advertisement

తమిళ్ కుబేర కు ప్రమోషన్స్ దెబ్బ

శేఖర్ కమ్ముల-ధనుష్-నాగార్జున కలయికలో బైలింగువల్ మూవీగా తెరకెక్కిన కుబేర చిత్రం తెలుగులో బిగ్ హిట్ దిశగా పరుగులు పెడుతుండగా.. తమిళనాట మాత్రం కలెక్షన్స్ పరంగా డల్ గా కనిపిస్తుంది. కోలీవుడ్ క్రిటిక్స్ కుబేర కి మంచి రివ్యూస్ ఇచ్చినా ఎందుకో తమిళ ఆడియన్స్ కుబేర ను ఆదరించడం లేదు. 

అయితే తమిళనాట కుబేర కి ఆదరణ కరువవ్వడానికి ప్రధాన కారణం ప్రమోషన్స్ అనే మాట వినిపిస్తుంది. కుబేర ను చెన్నై లో నామ్ కె వాస్త్ అన్నట్టుగా ప్రమోట్ చేసారు. తమిళ మీడియాలో కుబేర కి ఎలాంటి హైప్ లేకుండా పోయింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ స్టైల్ కూడా తమిళ ఆడియన్స్ కి అస్సలు ఇంట్రడక్షన్ లేకపోవడం కూడా తమిళంలో కుబేర ను పట్టించుకోకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. 

కుబేర కు ధనుష్ హీరో అయినప్పటికి.. కింగ్ నాగార్జున ను ధనుష్ తో సమానంగా ఉండే పాత్ర ఇవ్వడమే తమిళ ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది అనే వాదన కూడా వినవస్తుంది. తమిళనాట కుబేర కు ఎలాంటి పోటీ లేకపోయినా కోలీవుడ్ కుబేర వీక్ గా ఉండటం విచిత్రం అంటున్నారు..

అది ధనుష్ కి బిగ్ షాక్ అంటూ చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. మరి తెలుగులో హిట్ అయిన కుబేర తమిళనాట మాత్రం ప్లాప్ దిశగా పయనం చెయ్యడమే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 

Rude Shock in Tamil for Dhanush

Kuberaa Promotions: Hits and Misses
dhanush