అది నా మిస్టేక్ అంటున్న దిల్ రాజు

దిల్ రాజు కెరీర్ లోనే కనివిని ఎరుగని డిజాస్టర్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన గేమ్ ఛేంజర్. ఇండియన్ 2 నిర్మాతగా దిల్ రాజు శంకర్ ప్రక్కన చేరి ఎలాగో ఆ ప్రాజెక్ట్ నుంచి బయటపడినా గేమ్ ఛేంజర్ తో శంకర్ కి దొరికిపోయారు. గేమ్ ఛేంజర్ అవుట్ డేటెడ్ స్క్రిప్ట్ తో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. రామ్ చరణ్ కి అలాంటి సినిమా ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది, నేనెప్పుడూ అంత పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, అంత పెద్ద దర్శకులను కానీ డీల్ చెయ్యలేదు.
చాలా సినిమాలు చేశాను, కానీ గేమ్ ఛేంజర్ లాంటి బిగ్ ప్రాజెక్ట్ నెత్తినెత్తుకొలేదు, అది నా మిస్టేక్, గేమ్ ఛేంజర్ నా చేతిలో లేకుండా పోయింది. అది నాలుగున్నర గంటల పాటు నిడివి వచ్చిన మాట వాస్తవం. పెద్ద దర్శకులతో సినిమా చేసిన అనుభవం లేక ఇలా అయ్యింది, నేను తీసిన సినిమాలన్నీ నా చేతుల్లోనే ఉండేవి.
రామ్ చరణ్ కి అలాంటి ప్రాజెక్ట్ పడింది అనే బాధ ఉంది, అది గుర్తొచ్చినప్పుడల్లా చాలా ఎమోషనల్ అవుతాను, కానీ నేను ఏమి చెయ్యలేను, అలా పెద్ద ప్రాజెక్టు తలెకెత్తుకోవడం నేను చేసిన మిస్టేక్ అంటూ దిల్ రాజు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ విషయమై స్పందించారు.
Dil Raju calls producing Game Changer a wrong step in his career
Dil Raju about Game Changer disaster








































