నిర్మాతగా మారుతున్న కుర్ర హీరో

Young Hero To Turn Into A ProducerYoung Hero To Turn Into A Producer

చాలామంది హీరోలు.. అటు హీరోగా సినిమాలు చేస్తూ ఇటు ప్రొడ్యూసర్స్ గా మారుతున్నారు. ఆ విషయంలో హీరో నాని బాగా సక్సెస్ అయ్యాడు. హీరోగా సినిమాలు చేస్తూ హిట్స్ కొట్టడమే కాదు, నిర్మాతగా సొంత బ్యానర్ లో కోర్ట్ లాంటి చిత్రాలను నిర్మించి నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. ఇలా చాలామంది హీరోలు హీరో కమ్ నిర్మాతలుగా మారినవాళ్లు ఉన్నారు. సొంత బ్యానర్ పెట్టి హీరోలు సక్సెస్ అవుతున్నారు. 

ఇప్పుడు ఆ కోవలోకి మరో యంగ్ హీరో చేరబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతనెవరో కాదు రామ్ పోతినేని. ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో నటిస్తున రామ్ నిర్మాతగా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడనే వార్త మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

రామ్ తన పెదనాన్న స్రవంతి రవి కిషోర్ బ్యానర్ లో చాలా సినిమాలు చేసారు. ఇప్పుడు రామ్ కొత్త బ్యానర్ స్థాపించి ఓ కొత్త దర్శకుడితో ఓ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేందుకు సిద్దమవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Ram Pothineni to Turn Producer

ram