Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Varma is rumored to be dating Fatima Sana Sheikh

తమన్నాతో బ్రేకప్-మరో హీరోయిన్ తో డేటింగ్

మిల్కి బ్యూటీ 40 ప్లస్ లోను కెరీర్ లో చాలా బిజీగా కనిపిస్తుంది. సినిమాలు, వెబ్ సీరీస్ లు, స్పెషల్ సాంగ్స్ అంటూ తమన్నా హడావిడి మాములుగా లేదు. అయితే తమన్నా గత రెండేళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో డేటింగ్ చేసినా.. అది సీక్రెట్ గా మైంటైన్ చేసింది. ఆతర్వాత ఇద్దరూ మీడియాకి పట్టుబడ్డారు. అప్పటినుంచి పబ్లిక్ గానే డిన్నర్ డేట్స్, రెస్టారెంట్స్, వెకేషన్స్ కి తిరిగిన ఈ జంట ఇప్పుడు బ్రేకప్ చేసుకుంది. 

అవును విజయ్ వర్మ-తమన్నా పెళ్లి చేసుకుంటారు అనుకున్న సమయంలోనే తమన్నా-విజయ్ వర్మ తో లవ్ కి బ్రేకప్ చెప్పి సింగిల్ స్టేటస్ లోకి వచ్చేసింది. ఆతరవాత ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. ఇప్పుడు బ్రేకప్ అయ్యాక విజయ్ వర్మ మరో హీరోయిన్ ని తగులుకున్నాడనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

విజయ్ వర్మ మరో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు అని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి ఫాతిమా సన షేక్‌.. రీసెంట్ గా విజయ్ వర్మ, ఫాతిమా సన షేక్‌ లంచ్ డేట్ కి వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో విజయ్ ను టైట్ గా హగ్ చేసుకోవడం.. అతనికి ముద్దుపెట్టడం వంటివి చేసింది. అంతే కాదు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీస్తున్నప్పటికీ ఆమె కూడా విజయ్ వర్మ తో క్లోజ్ గా ఫోటోలకు పోజులిచ్చింది. అప్పటినుంచి విజయ్ వర్మతో ఫాతిమా డేటింగ్ లో ఉంది అనే వార్తలు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లోనే కాదు సోషల్ మీడియాలోనూ స్ప్రెడ్ అయ్యాయి. 

Vijay Varma is rumored to be dating Dangal actress Fatima Sana Sheikh

Vijay Varma is rumored to be dating Fatima Sana Sheikh
vijay varma