Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sitare Zameen Par: Aamir Khan starrer cleared by censor

అగ్ర హీరో సినిమాకి సెన్సార్ క్లియ‌రెన్స్

ఎట్ట‌కేల‌కు ప‌రిశ్ర‌మ అగ్ర హీరో అమీర్ ఖాన్ సినిమా సెన్సార్ క్లియ‌రెన్స్ పూర్తి చేసుకుని చెప్పిన తేదీకే విడుద‌ల‌వుతోంది. జూన్ 20 రిలీజ్ తేదీని లాక్ చేసుకుంది `సీతారే జ‌మీన్ ప‌ర్`. ఈ చిత్రంలో న‌టించిన అమీర్ ఖాన్ మొండి ప‌ట్టు కార‌ణంగా, సెన్సార్ క్లియ‌ర్ కాలేద‌ని, సెన్సార్ ప్ర‌తినిధులు రెండే రెండు క‌ట్స్ చెబితే, దానికి అభ్యంత‌రం చెప్పాడ‌ని ప్ర‌చారం సాగింది. 

కానీ చివ‌ర‌కు సెన్సార్ బృందాన్ని అమీర్ ఖాన్ ఒప్పించాడ‌ని, క‌ట్స్ లేకుండానే సినిమాని రిలీజ్ చేసుకుంటున్నాడ‌ని కూడా గుస‌గుస వినిపిస్తోంది. ఆర్.ఎస్.ప్ర‌స‌న్న ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రంలో బొమ్మ‌రిల్లు హాసిన జెనీలియా ఒక కీల‌క పాత్ర‌ను పోషించింది. క్రీడా స్ఫూర్తిని ర‌గిలించే ఈ చిత్రంలో మాన‌సిక విక‌లాంగుల టీమ్ కి కోచ్ గా అమీర్ ఖాన్ క‌నిపిస్తాడు. ఈ శుక్ర‌వారం సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. 

ఇంత‌లోనే సోమ‌వారం సాయంత్రం ముంబైలో జ‌రిగిన ప్రివ్యూలో అమీర్ ఖాన్ అత‌డి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్, జెనీలియా త‌దిత‌రులు క‌నిపించారు. అమీర్ ఖాన్ కొత్త గాళ్ ఫ్రెండ్ గౌరీ ఈ ప్రివ్యూ స‌మ‌యంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మారారు.

Aamir Khan Sitaare Zameen Par Cleared By CBFC

Sitare Zameen Par: Aamir Khan starrer cleared by censor
aamir khan