Advertisement

థగ్ లైఫ్ ఓటీటీ డేట్ లాకయ్యిందా

మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్-శింబు ప్రధాన పాత్రలు పోషించిన థగ్ లైఫ్ ఎన్నో అంచనాల నడుమ ఈ నెల 5 న థియేటర్స్ లో విడుదలైంది. థగ్ లైఫ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కమల్ ఇంకా మణిరత్నం కాన్ఫిడెన్స్ చూసి థగ్ లైఫ్ పొన్నియన్ సెల్వన్ మాదిరి హిట్ అవుతుంది అనుకున్నారు. 

కానీ థగ్ లైఫ్ వీక్షించిన ప్రతి ప్రేక్షకుడు మణిరత్నం అవుట్ డేటెడ్ దర్శకత్వాన్ని, కమల్ హాసన్ పోషించిన కేరెక్టర్ ని, త్రిష కేరెక్టర్, కథ, ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్, BGM అన్నిటిని తీవ్రస్థాయిలో విమర్శించారు. థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసే రిజల్ట్ వచ్చిన థగ్ లైఫ్ ఓటీటీ పై పలు రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఫ్యాన్సీ డీల్ తో థగ్ లైఫ్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ థగ్ లైఫ్ థియేటర్స్ లో నిరాశ పరచడంతో.. ఓటీటీ డీల్ ని బ్రేక్ చేసి తొందరగా స్ట్రీమింగ్ చేస్తుంది అని భావించారు. తాజా సమాచారం ప్రకారం థగ్ లైఫ్ ని ఈ జూన్ 27 లేదా జూలై 4న ముందుగా సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ లోకి తెచ్చి హిందీ వెర్షన్ ని జూలై 31కి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

Kamal Haasan Thug Life OTT release details

Is Thug Life OTT date locked?
kamal haasan