సన్ రైజర్స్ కావ్య మారన్‌తో ప్రేమాయణం

సన్ రైజర్స్ టీమ్ సహయజమాని కావ్య మారన్ తో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రేమలో ఉన్నాడంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒకటి కాబోతున్నారు. ఏడాది కాలంగా వీరి ప్రేమాయణం కొనసాగుతోంది అంటూ రెడిట్ లో ప్రచారం సాగుతోంది.
అయితే ఈ పుకార్లపై అనిరుధ్ స్పందించారు. ``నాకు పెళ్లి.. హహహ... ఊహాగానాలు ఆపండి..`` అంటూ కొట్టి పారేసాడు. అయితే అతడు ఎక్కడా కావ్యా మరన్ పేరెత్తకపోవడంతో అది మరింతగా సందేహాలకు తావిచ్చింది. ఈ జంట కలిసి డిన్నర్ డేట్ లు, ఔటింగులకు వెళ్లినప్పటి కొన్ని ఫోటోల్ని కూడా అభిమానులు షేర్ చేస్తున్నారు.
ఈ జంట పెళ్లికి దగ్గరైంది. అనిరుధ్ బంధువే అయిన రజనీకాంత్ నేరుగా సన్ టీవీ కళానిధి మారన్ తో వీరి బంధం గురించి చర్చించారు. జంట బావుంది.. పెళ్లి చేసేద్దామని ఆయన అడిగినట్టు కూడా పుకార్లు షికార్ చేస్తున్నాయి. కావ్య సన్ రైజర్స్ టీమ్ సహయజమానిగా వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్నారు. క్రికెట్ గ్రౌండ్స్ లో కనిపిస్తూ యువహృదయాలను గెలుచుకున్నారు. అనిరుధ్ రవిచందర్ కూడా క్లీన్ బౌల్డ్ అయిపోయాడని ప్రచారం సాగుతోంది. అనిరుధ్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా అత్తమ్మ అవుతుంది. అతడి తల్లిదండ్రులు సినీరంగానికి చెందిన వారు.
Kavya Maran and Anirudh Ravichander love story
Kavya Maran and Anirudh Ravichander Getting Hitched









































