ఈ హాటీ కోస‌మే 200కోట్లు పెట్టారా

ఖిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన హౌస్ ఫుల్ 5 ఇటీవ‌లే థియేట‌ర్లో విడుద‌లై ఐదు రోజుల్లో ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్ల‌ను సాధించింది. ఫ్రాంఛైజీలో తొలి నాలుగు భాగాలు బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకున్నా కానీ, ఈ ఐదో భాగంపై క్రిటిక్స్ పెద‌వి విరిచేసారు. ముఖ్యంగా ఈ సినిమాలో అస‌భ్య‌క‌రమైన జోకులు, ఓవ‌ర్ ఎక్స్ పోజింగ్ పై క్రిటిక్స్ విరుచుకుప‌డ్డారు.

 

భారీ తారాగ‌ణంతో దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ వెచ్చించి తెర‌కెక్కించిన ఈ చిత్రానికి స్క్రిప్టు వీక్ అంటూ స‌మీక్ష‌కులు విమ‌ర్శించారు. అయితే ఇంత పెద్ద బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్ర‌ధానంగా ఓ బోల్డ్ బ్యూటీకి బాగా క‌లిసొచ్చింది. ఈ సినిమాలో న‌టించిన జాక్విలిన్, న‌ర్గీస్ ఫ‌క్రీ, సోన‌మ్ బ‌జ్వా లాంటి భామ‌ల గురించి సోసోగానే ముచ్చ‌టించుకుంటున్నా, ఇందులో హ‌ద్దులు  చెరిపేసి ఎక్స్ పోజ్ చేసిన సౌంద‌ర్య శ‌ర్మ గురించి ఎక్కువ‌గా యువ‌త‌రం ముచ్చ‌టించుకుంటోంది. ఈ భామ‌ను ఒక వ‌స్తువులా చూపించాడు ద‌ర్శ‌కుడు. సె*జం కోస‌మే ఈ పాత్ర‌ను ఉప‌యోగించుకున్నాడు. సౌంద‌ర్య శ‌ర్మ ఒక ర‌కంగా గ్లామ‌ర్ వ‌ర‌ద పారించింది. వేడెక్కించే హావ‌భావాల‌తో మ‌త్తెక్కించింది అంటూ యూత్‌లో చ‌ర్చ సాగుతోంది.

 

నిజం చెప్పాలంటే ఇంత బ‌డ్జెట్ పెట్టింది ఈ భామ‌ను ఎలివేట్ చేసేందుకే! అంటూ జోకులు వేస్తున్నారు. మస్తీ, గ్రాండ్ మ‌స్తీ త‌ర‌హా ట్రీట్ ఇస్తూ,  ప్ర‌తి ఫ్రేమ్ లో సౌంద‌ర్య రెచ్చిపోంది. ఈ సినిమాలో ఇత‌ర అందాల భామ‌ల్ని ఎవరూ అంత‌గా ప‌ట్టించుకోలేదు.  కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన రితేష్ గురించి కానీ, అభిషేక్ బ‌చ్చ‌న్ గురించి కానీ అస‌లు ముచ్చ‌టే లేదు. సౌంద‌ర్య శ‌ర్మ గ‌తంలో ర‌క్తాంచ‌ల్ అనే వెబ్ సిరీస్ లో అందాల ఆర‌బోత‌తో ఆక‌ట్టుకుంది. రాంచీ డైరీస్ అనే సిరీస్ లోను న‌టించింది. బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టించింది. ఐఏఎస్ లు, డాక్ట‌ర్లు ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన సౌంద‌ర్య గ్లామ‌ర‌స్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలుగుతోంది.

Soundarya Sharma gained big with Housefull 5

200 crores spent for this hottie
soundarya sharma