Advertisement

హైదరాబాద్ లో కొమ్మినేని అరెస్టు

రాజధాని మహిళలపై అసభ్యకార వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావును ఈరోజు హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీలో పోలీసులు అరెస్ట్ చేసారు. కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొస్తున్నారు గుంటూరు పోలీసులు. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్ లో రాజధాని రైతులు, మహిళల కేసు పెట్టారు. జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపైనా కేసు నమోదు అయ్యింది. 

జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేనితో పాటు సాక్షి యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు పోలీసులు. సాక్షి ఛానల్ లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజు, అమరావతి వేశ్యల రాజధాని అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు చర్చలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 

ఆ చర్చ వేదికలో అసభ్య వ్యాఖ్యలను ఆపకుండా చర్చ కొనసాగించిన కొమ్మినేని శ్రీనివాసరావు పై మహిళల ఫిర్యాదు తో కేసు నమోదు చేసారు. ఇక కృష్ణంరాజు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు కనిపించకుండా తప్పించుకోవడంతో జర్నలిస్ట్ కృష్ణంరాజును పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 

Kommineni Srinivas arrested in Hyderabad

Kommineni arrested
kommineni srinivas