సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన చరణ్ హీరోయిన్

రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న జెనీలియా, షాజాన్ పదమ్సీ లలో జెనీలియా ఎప్పుడో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. ఇపుడు ఆరెంజ్ లోని మరో భామ షాజాన్ పదమ్సీ కూడా పెళ్లి చేసుకుంది. అది కూడా సైలెంట్ గా ఆమె పెళ్లి పీటలెక్కింది.
ఓ బిజినెస్ మ్యాన్ తో తాళి కట్టించుకుని ఏడడుగులు నడిచింది షాజన్. ఆ బిజినెస్ మ్యాన్ ఎవరో కాదు. మూవీ మ్యాక్స్ సినిమా సీఈఓ ఆశిష్ కనాకియ. షాజన్ కి ఆశిష్ ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడి, తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ జనవరిలో నిశ్చితార్ధం చేసుకుని జూన్ 5 న పెళ్లి పీటలెక్కారు.
అంగరంగ వైభవంగా జరిగిన షాజాన్ పదమ్సీ-ఆశిష్ వివాహం తర్వాత రేపు అంటే జూన్ 7 న గ్రాండ్ గా షాజన్-ఆశిష్ ల వెడ్డింగ్ రిసెప్షన్ జరగబోతుంది.
Shazahn Padamsee and Ashish Kanakia from their wedding album
Shazahn Padamsee ties the knot with Ashish Kanakia








































