ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> He threatened the superstar with a gun

సూప‌ర్‌స్టార్‌ని తుపాకీతో బెదిరించాడు

ఇది ప‌రిశ్ర‌మ‌లో ఒక అగ్ర క‌థానాయ‌కుడి రియ‌ల్ స్టోరి. అత‌డి బావ‌మ‌రిది త‌న సోద‌రిని క‌ల‌వ‌కూడ‌ద‌ని బెదిరిస్తూ తుపాకీ గురి పెట్టాడు. వివ‌రాల్లోకి వెళితే... బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ జంట స్కూల్ డేస్‌లోనే ప్రేమికులుగా మారారు. వారు మతాంతర వివాహం చేసుకున్నారు. గౌరీ 9వ తరగతిలో ఉన్నప్పుడు వారు ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో షారుఖ్ 12వ తరగతిలో ఉన్నాడు. వారు చాలా చిన్న వయస్సులోనే ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించడంతో, గౌరీ సోదరుడు విక్రాంత్ చిబ్బర్ త‌న సోద‌రి విష‌యంలో చాలా భ‌య‌ప‌డుతూ, క‌ల‌త చెందుతూ ఉండేవాడు. అందువల్ల తన చెల్లిని చూసినందుకు షారుఖ్‌ను బెదిరించేవాడు. గౌరీకి హాని కలిగించవద్దని వార్నింగులు ఇచ్చేవాడు.

కపిల్ శర్మతో ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ దీని గురించి మాట్లాడాడు. బావ‌మ‌రిది తనను తుపాకీతో బెదిరించేవాడని కూడా వెల్లడించాడు. త‌నతో అత‌డు ఎప్పుడూ మర్యాద(జోకింగ్ )గా ప్రవర్తించేవాడని SRK వెల్లడించారు. గౌరీ తల్లిదండ్రులు తమ మతాంతర వివాహాన్ని మొదట వ్యతిరేకించారని, అయితే తరువాత నెమ్మ‌దిగా ఒప్పించాన‌ని తెలిపాడు. 

డేటింగ్ దశలో ఖాన్ పేరును అభినవ్‌గా మార్చింది గౌరీ. దాంతో ఖాన్ కాస్తా హిందువు అని ఇంట్లో వాళ్లు భావిస్తారని గౌరీ అనుకుంది. కానీ అత‌డు ముస్లిమ్ అని తెలిసిపోయింది. త‌ర్వాత గొడ‌వ‌లు కూడా అయ్యాయి.

SRK Was Threatened By Gauri Brother With A Gun

He threatened the superstar with a gun
srk