ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి చాలా చిన్న వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన చిత్రంతోనే అమ్మడు సూపర్ హిట్ కొట్టడంతో.. కృతి శెట్టిపై అందరిలో అంచనాలు మొదలైతే, కుర్ర హీరోలంతా వరస బెట్టి కృతి శెట్టి కి ఛాన్స్ లు ఇచ్చారు. మొదట్లో ఒకటిరెండు హిట్స్ పడినా ఆ తర్వాత వరస డిజాస్టర్ అమ్మడిని బాగా ఇబ్బంది పెట్టాయి.
ప్రస్తుతం కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాధన్ తో కలిసి LIC చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి గ్లామర్ షో చేస్తున్నట్టుగా రీసెంట్ గా బయటికొచ్చిన వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టిన కృతి శెట్టి కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తూ దర్శకనిర్మాతలకు వల వేస్తుంది. తాజాగా కృతి శెట్టి మినీ స్కర్ట్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఇక మరో హీరోయిన్ రాశి ఖన్నా ప్రకృతి అందాలను చూస్తూ మైమరిచిన పిక్ షేర్ చేసింది. తెలుగులో నితిన్ తమ్ముడు, సిద్దు జొన్నలగడ్డతో తెలుసు కదా చిత్రాల్లో నటిస్తున్న రాశి ఖన్నా నార్త్ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా అమ్మడు టూ గ్లామర్ షో చేస్తూ స్లిమ్ అవతారమెత్తింది. ప్రస్తుతం రాశి ఖన్నా ప్రకృతి అందాల పిక్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.