ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prashanth Neel unhappy with the success of Salaar

సలార్1 రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి

Prashanth Neel unhappy with the success of SalaarPrashanth Neel unhappy with the success of Salaar

సలార్ పార్ట్ 1 విడుదలై నేటికి ఏడాది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ లు కలిసి నటించిన సలార్1 చిత్రాన్ని కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలైన సలార్ చిత్రం మాస్ హిట్ గా నిలిచింది. సలార్ 1 విడుదలై నేటికి ఏడాది అంటూ మేకర్స్ పోస్టర్ కూడా వదిలారు. 

అయితే సలార్ పార్ట్ 1 రిజల్ట్ పై తాను హ్యాపీగా లేను అంటూ ప్రశాంత్ నీల్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. సలార్ పార్ట్ 1 సక్సెస్ అయినా.. దానిలో ఎక్కడో కెజిఎఫ్ 2 ఛాయలు కనిపించాయి. సలార్ పార్ట్ 1 కోసం చాలా కష్టపడ్డాను. సలార్ 2ని మాత్రం నా కెరీర్ లో బెస్ట్ చిత్రంగా నిలిచిపోయేలా చేస్తాను. ఆడియన్స్, ఫ్యాన్స్ ఊహలకు అందని విధంగా సలార్ 2 ఉంటుంది. 

నా లైఫ్ లో కొన్ని విషయాలపై చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను, అందులో సలార్ 2 కూడా అంటుంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కు ప్రశాంత్ నీల్ సలార్ 2 పై అంచనాలు పెంచుతూనే మాటిచ్చేసారు. 

Prashanth Neel interview respond Salaar result and part 2

prashanth neel