Loading...

ఉస్తాద్ రామ్ వింటేజ్ లుక్ చూశారా..

Ram Pothineni Vintage Look Revealed

ఇస్మార్ట్, డబుల్ ఇస్మార్ట్ అంటూ ఊర మాస్ లుక్‌లో కనిపించిన ఉస్తాద్ రామ్ పోతినేని ఒక్కసారిగా లవర్ బాయ్‌గా మారాడు. డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేని, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్నారు. 

శుక్రవారం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. ఈ విషయం తెలుపుతూ.. మేకర్స్ రామ్ లుక్‌ని రివీల్ చేశారు. వింటేజ్ లుక్‌లో రామ్ ఈ పోస్టర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామ్ మేకోవర్ సూపర్బ్ అనేలా ఈ పోస్టర్‌కి కామెంట్స్ పడుతున్నాయి. ఇందులో సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నాడు.

ఈ పోస్టర్‌ని గమనిస్తే.. పాత రోజుల్లో వాడే సైకిల్ వెనుక రామ్ క్లీన్ షేవ్‌లో, లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. చేతిలో బుక్ చూస్తుంటే, అతను కాలేజ్ స్టూడెంట్ అనేది అర్థమవుతోంది. రామ్ ఇలా కనిపించి చాలా కాలమే అవుతుంది. RAPO22గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొత్తంగా అయితే.. ఈసారి రామ్ మంచి కంటెంట్ ఉన్న చిత్రంతో రాబోతున్నాడనే ఫీల్‌ని ఈ పోస్టర్ ఇస్తోంది.

Ram Pothineni Stunning Makeover For RAPO22

ram pothineni