మెకానిక్ రాకీ ఓటీటీ డేట్ వచ్చేసింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రాగా.. క్రిటిక్స్ కూడా మెకానిక్ రాకీకి మిక్స్‌డ్ రివ్యూస్ ఇచ్చారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. విశ్వక్ సేన్ పెరఫార్మెన్స్, అలాగే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోవడం ఫ్లాట్ నేరేషన్ అన్ని ప్రేక్షకులను డిజప్పాయింట్ చేశాయి. 

ఇక నవంబర్ 22 న థియేటర్స్ లో విడుదలైన మెకానిక్ రాకీ చిత్రం ఓటీటీ రిలీజ్ కోసం విశ్వక్ సేన్ అభిమానులు అప్పుడే వెయిట్ చేస్తున్నారు. మెకానిక్ రాకీ ఓటీటీ హక్కులను ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వారు ఈ చిత్ర స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు. 

ఈ నెల 20 నుంచి అంటే థియేటర్స్‌లో విడుదలైన నాలుగు వారాల్లోపే ఈ మెకానిక్ రాకీ ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 20 నుంచి మెకానిక్ రాకీ ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుంది అని త్వరలోనే ప్రైమ్ వీడియో అనౌన్స్ చేస్తుంది అని సమాచారం.

Vishwak Sen Mechanic Rocky on Amazon Prime Video from December 20

Mechanic Rocky OTT Release Date
mechanic rocky