బిగ్ బాస్ 8: ఈ వారం డబుల్ షాక్

Bigg Boss 8: Double shock this weekBigg Boss 8: Double shock this week

బిగ్ బాస్ సీజన్ 8 పది వారాలు పూర్తి చేసుకుని పదకొండో వారంలోకి ఎంటర్ అవుతుంది.నాగార్జున ఈ వారం హౌస్ మేట్స్ ని పిలిచి అందరికి పెద్ద షాకే ఇచ్చారు. ఒక్కొక్కళ్ళని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్ లో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పమని పర్సనల్ గా అడిగారు. ఆ విషయంలో హౌస్ మేట్స్ నిజంగానే షాకయ్యారు. 

ఎక్కువగా టేస్టీ తేజ పేరు, విష్ణు ప్రియాల పేర్లు వరెస్ట్ కంటెస్టెంట్స్ గా చెప్పారు. విష్ణు ప్రియా కొంతమందితో మాత్రమే మింగిల్ అవుతుంది ఆమె అందరితో ఉండడం లేదు అని నబీల్, ప్రేరణ చెప్పగా, యష్మి ఇంకా హరితేజ లు రోహిణి పేరు చెప్పారు. ఇక నిఖిల్, పృథ్వీ, విష్ణు ప్రియాలు మాత్రం టేస్టీ తేజ పేరు చెప్పారు. 

మరి ఎవ్వరికి వరెస్ట్ కంటెండర్ గా ఎక్కువమంది ఓట్ వేసారో వారు ఫ్యామిలీ వీక్ లో తమ ఫ్యామిలీని కలిసే అవకాశం లేదు అంటూ నాగార్జున హౌస్ మేట్స్ కి బిగ్ షాక్ ఇచ్చారు. అందులో టేస్టీ తేజ ని ఎక్కువగా వరెస్ట్ కంటెండర్ గా చెప్పడంతో తేజ ఫీలయ్యాడు.  మరోపక్క గంగవ్వ నాకు ప్రాణం బాగోవడం లేదు అంటే, హౌస్ లో ఉంటావా, వెళ్తావా అని నాగ్ సూటిగా ప్రశ్నించారు. వెళ్తాను అంటూ గంగవ్వ ఇంటికెళ్ళిపోయింది. 

దానితో హౌస్ మేట్స్ హమ్మయ్య అనుకున్నారు. చివరికి ఎవిక్షన్ ప్రీ పాస్ నబీల్ కి దొరకగా.. ఇక ఫైనల్ గా ఈ వారం ముందు నుంచి అనుకున్నట్టుగానే హరితేజ కూడా ఎలిమినేట్ అవడంతో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. దానితో హౌస్ మేట్స్ కు బిగ్ షాక్ తగిలింది. 

Bigg Boss Telugu 8: Double elimination this week

bigg boss telugu 8