అల్లు అర్జున్ డే అండ్ నైట్ కష్టాలు

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ద రూల్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. సినిమా విడుదలకు నెల సమయం కూడా లేదు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, మరోపక్క ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. ఆ విషయంలో అల్లు అభిమానులు ఆందోళ పడిపోతున్నారు. మేకర్స్ కూడా పుష్ప 2 షూటింగ్ విషయంలో కిందా మీదా పడుతున్నారు.
ఇక అల్లు అర్జున్ అయితే డే అండ్ నైట్ పుష్ప ద రూల్ విషయంలో తలమునకలై ఉన్నాడు. నవంబర్ 19 కల్లా పుష్ప 2 షూటింగ్ ఫినిష్ చేసేసి ప్రమోషన్స్ కు ఎవైలబుల్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రతిరోజు పుష్ప సెట్స్ కు వెళ్లేముందు తన పాత్ర తాలూకు డబ్బింగ్ చెప్పి మరీ షూట్ కి వెళుతున్నది.
దీనిని బట్టి అల్లు అర్జున్ ప్రతి నిమిషం పుష్ప 2 కంప్లీట్ అయ్యేలా కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఇక ఐటమ్ సాంగ్ ను కూడా సుకుమార్ చక చకా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట. పుష్ప2 విడుదల సమయానికి ఎలాంటి టెన్షన్ లేకుండా చూసుకుంటున్నారట.
Pushpa The Rule shooting update
Allu Arjun day and night hardships






































