Advertisementt

బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దెయ్యాలు

Sun 03rd Nov 2024 01:07 PM
bollywood  బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దెయ్యాలు
Demons shaking Bollywood బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దెయ్యాలు
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బాక్సాఫీసుని దెయ్యాల కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు షేక్ చేస్తున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాల్తో పోటీ పడి మరీ నార్త్ ఆడియన్స్ ప్రేమను గెలుచుకుంటున్నాయి. బాలీవుడ్ లో ప్రేక్షకులు దెయ్యం కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలను ఈమధ్య కాలంలో బాగా ఇష్టపడుతున్నారు అనడానికి పెద్ద ఉదాహారణ స్త్రీ 2, నిన్న దీపావళికి విడుదలైన భూల్ భులాయియా-3. 

శ్రద్ధా కపూర్ - రాజ్ కుమార్ రావు కాంబోలో ఆగష్టు లో విడుదలైన స్త్రీ 2 బాక్సాఫీసుని చెడుగుడు ఆడేసింది. ఇది మీడియం రేంజ్ సినిమాగా తెరకెక్కినా.. ఒకటా రెండా ఏకంగా 700 కోట్లకు పైగానే కలెక్షన్స్ కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు అదే రేంజ్ హిట్ దిశగా భూల్ భులాయియా-3 పరుగులు తీస్తుంది. 

కార్తీక్ ఆర్యన్ హీరోగా దీపావళి స్పెషల్ గా ఈ శుక్రవారం సింగం అగైన్ కి పోటీగా బాక్సాఫీసు దగ్గరకు వచ్చిన భూల్ భులాయియా-3 మొదటిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకున్న తీరు చూస్తే హిందీ ప్రేక్షకులు డిఫ్రెంట్ కంటెంట్ ని ఇష్టపడుతున్నారు, అందులోను ఘోస్ట్ కంటెంట్ కు జై కొడుతున్నారనిపించడం ఖాయం. 

సింగం అగైన్ లో అజయ్ దేవగన్, కరీనా మెయిన్ లీడ్ అయినా సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా, టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామంది స్టార్స్ స్పెషల్ కేరెక్టర్స్ లో మెరిశారు. అయినప్పటికి నార్త్ ఆడియన్స్ భూల్ భులాయియా-3 కి భారీ ఓపెనింగ్స్ ఇవ్వడం చూస్తే బాలీవుడ్ బాక్సాఫీసుని దెయ్యాల సినిమాలు షేక్ చేస్తున్నాయని చెప్పొచ్చు. నిన్న, ఈరోజు కూడా భూల్ భులాయియా-3 కి కలెక్షన్స్, బుకింగ్స్ అదిరిపోతున్నాయి. 

Demons shaking Bollywood:

They are making hits in Bollywood with ghost stories

Tags:   BOLLYWOOD
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ